హాయ్ ఫ్రెండ్స్, నా ఈ Infinity బ్లాగర్ కు స్వాగతం – సుస్వాగతం
నేను... ఈ Infinity బ్లాగర్ ను ప్రారంభించిన ముఖ్యోద్దేశము ఏమిటంటే.. ప్రస్తుత కాలపరిస్థితిలో చిన్న వయస్కుల వారు నుండి పెద్దవారు వరకు, అందరూ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరికి చదువు వున్నను, లేకున్ననూ, ఆండ్రాయిడ్ ఫోన్ లో మునిగి తేలుతున్నారు. కాబట్టి నా మదిలో ఒక చిన్న ఆలోచనల వచ్చి, ఈ Infinity బ్లాగర్ ను ప్రారంభించాలని తలచాను. వయస్సు అంటున్నారు, ఆండ్రాయిడ్ అంటున్నారు ఎంటబ్బా అని అనుకొంటున్నారా ?
ఎన్నో బ్లాగర్లు ఉన్నప్పటికి నా ఈ Infinity బ్లాగర్ లో అంతలా ఏమి వుంటుంది అన్న సందేహము మీకు వచ్చినట్టు వుంది కదా. మీరు ఊహించినది కరెక్టే.. మరి నా ఈ Infinity బ్లాగర్ లో ఏయే విషయాలు పోస్టుచేయబడుచున్నవో ఇప్పుడు చూద్దాం.
అసలు బ్లాగర్ పేరు Infinity గురించి:
Infinity అంటే .. అనంతము.. అంటే, ఎంత చదువుకొన్నను, ఎంత జ్ఞానము ఉన్నప్పటికి, నేటి ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి ముందూ అందరూ దాసోహమే... చదువు లేనివారు కూడా కొద్దో గొప్పో తెలుసుకొని ముందుకు వెళుతుంటే.. మనం ఎందుకు వెనుకబడాలి అన్న ఆలోచనతో.. నేటి సమాజంతో నేను పోటీ పడాలన్న తపనతో, నేను ప్రతి విషయాన్ని నేర్చుకొంటూ, ఈ Infinity బ్లాగర్లో పోస్టుచేస్తున్న విషయాలను తెలుసుకొని, నేను మరియు నా ఈ బ్లాగర్ చూస్తున్న వారందరు టెక్నాలజీతో పోటీ పడాలన్న సంకల్పముతో ప్రారంభించినదే ఈ Infinity బ్లాగర్.
ఈ Infinity బ్లాగర్లో ప్రతి విషయమును అనగా, సైన్సు అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ పరిజ్ఞానము, వైజ్ఞానము మొదలగు మరెన్నీ విషయములను కూలంకుషంగా, అచ్చ మన తెలుగులో మాతృబాషలో తెలియపరచాలన్నదే నా ఆశయం.
కావున, తామెల్లరూ.. నా బ్లాగ్ లో పోస్టుచేస్తున్న విషయాలను చదివి, తెలుసుకోవాలన్న, నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి, మంచి బ్లాగులను పోస్టుచేయుటకు నాకు అవకాశమును కల్పించవలసినదిగా నా యొక్క చిన్న విన్నపము. అంతేకాదు.. నా Infinity యూట్యూబ్ ఛానల్ ను కూడా చూడమని కోరుచున్నాను.
ఇట్లు,
మీ Infinity బ్లాగర్

No comments:
Post a Comment