Sunday, 7 December 2025

Search Engines & Browsers,





I. సెర్చ్ ఇంజెన్ల మరియు బ్రౌజర్ల గురించి తెలుసుకొందాం

I. సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి?

ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని సమీకరించి (ఇండెక్సింగ్) లేదా వెతికి, యూజర్ అడిగిన ప్రశ్నకు సరిపడ ఫలితాలను చూపించే సాఫ్ట్‌వేర్‌నే సెర్చ్ ఇంజిన్ అంటారు.

 

a. సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది?

1.         Crawling (క్రాలింగ్) బాట్స్ (Bots)/స్పైడర్స్ వెబ్‌సైట్లను స్కాన్ చేస్తాయి.

2.         Indexing (ఇండెక్సింగ్) సేకరించిన సమాచారాన్ని డేటాబేస్‌లో నిల్వ చేస్తాయి.

3.         Ranking (ర్యాంకింగ్) అల్గారిథమ్స్ (ఉదా: Google PageRank) ఆధారంగా లిస్టింగ్ చేస్తుంది.

4.         Retrieval (రిట్రీవల్) యూజర్‌కు సంబంధిత ఫలితాలను చూపిస్తాయి.

 

b. ప్రయోజనాలు (Merits)

         విస్తృతమైన సమాచారాన్ని తక్షణం అందిస్తుంది

         వ్యక్తిగతీకరించిన ఫలితాలు

         ఇమేజ్, వీడియో, మ్యాప్ వంటి మల్టీమీడియా సెర్చ్

         ఇతర సేవలతో ఇంటిగ్రేషన్

 

c. లోపాలు (Demerits)

         ప్రైవసీ సమస్యలు (డేటా ట్రాకింగ్)

         ప్రకటనల ప్రభావం ఎక్కువగా ఉంటాయి.

         సమాచారం అధికంగా ఉండటం వల్ల గందరగోళం

         ప్రాంతీయ పరిమితులు

 

Google ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కల్గి వున్నప్పటికీ, చైనా, రష్యా మొదలగు దేశాల వారు ప్రైవేసీ కోసం ప్రత్యేకమైన సర్చ్ ఇంజన్లను వుపయోగిస్తారు.  ఉదా:- DuckDuckGo, Baidu, Yandex మొదలగున్నవి.




II. ఈ సెర్చ్ ఇంజెన్ల ఏవిధంగా పనిచేస్తాయో చూద్దాం

Google PageRank అల్గారిథమ్ మరియు Bing ర్యాంకింగ్ సిస్టమ్ మధ్య ప్రధాన తేడా ఏమిటంటే – Google ఎక్కువగా లింకుల నాణ్యతపై దృష్టి పెడుతుంది, Bing మాత్రం కంటెంట్, కీవర్డ్స్, యూజర్ అనుభవంపై ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.


 

 

Google PageRank అల్గారిథమ్

Bing ర్యాంకింగ్ సిస్టమ్

స్థాపకులు:

లారీ పేజ్, సెర్గే బ్రిన్

మైక్రోసాఫ్ట్

స్థాపించిన సంవత్సరము

1998

2009

పనిచేసే విధానం

ఒక వెబ్‌పేజీకి వచ్చే లింకుల సంఖ్య మరియు నాణ్యత ఆధారంగా దాని ప్రాముఖ్యతను అంచనా వేస్తుంది.

ü  కీవర్డ్ మ్యాచ్ యూజర్ ఇచ్చిన పదాలను కంటెంట్‌లో నేరుగా చూసి ర్యాంక్ చేస్తుంది.

ü  కంటెంట్ నాణ్యత స్పష్టమైన, సులభమైన, యూజర్‌కు ఉపయోగపడే కంటెంట్‌ను ప్రాధాన్యం ఇస్తుంది.

ü  సోషల్ సిగ్నల్స్ – Facebook, Twitter వంటి సోషల్ మీడియా షేర్లు కూడా ప్రభావం చూపుతాయి.

ü      యూజర్ అనుభవం పేజీ లోడ్ వేగం, మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్, క్లిక్-థ్రూ రేట్స్.

ప్రయోజనం

·        అధిక నాణ్యత గల వెబ్‌సైట్లు పై ర్యాంక్‌లో వస్తాయి.

·        స్పామ్ లింకులను గుర్తించి ఫిల్టర్ చేస్తుంది.

ü  కొత్త వెబ్‌సైట్లు కూడా కీవర్డ్ ఆప్టిమైజేషన్ ద్వారా త్వరగా ర్యాంక్ అవుతాయి.

ü  మల్టీమీడియా (ఇమేజ్, వీడియో) సెర్చ్‌లో బలంగా ఉంటుంది.

లోపాలు

       కొత్త వెబ్‌సైట్లు లింకులు లేకపోవడం వల్ల ర్యాంక్ పొందడం కష్టం.

       లింక్ బిల్డింగ్ మానిప్యులేషన్‌కు అవకాశం ఉంటుంది.

ü  లింకుల ప్రాముఖ్యత Google కంటే తక్కువ.

ü  గ్లోబల్ మార్కెట్ షేర్ తక్కువ.

SEO స్ట్రాటజీ

·        లింక్ బిల్డింగ్: అధిక నాణ్యత గల వెబ్‌సైట్ల నుండి బ్యాక్‌లింక్స్ పొందడం చాలా ముఖ్యం.

·        కంటెంట్ నాణ్యత: యూజర్‌కు ఉపయోగపడే, లోతైన, ఒరిజినల్ కంటెంట్ Googleలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతుంది.

·        మొబైల్ ఫ్రెండ్లీ: మొబైల్ ఆప్టిమైజేషన్ తప్పనిసరి.

·        పేజీ స్పీడ్: వేగంగా లోడ్ అయ్యే వెబ్‌సైట్లు Googleలో పై ర్యాంక్ పొందుతాయి.

·        యూజర్ బిహేవియర్: CTR (Click Through Rate), Bounce Rate వంటి మెట్రిక్స్ కూడా ప్రభావం చూపుతాయి.

Ø  కీవర్డ్ ఆప్టిమైజేషన్: Bingలో కీవర్డ్‌లను టైటిల్, మెటా ట్యాగ్స్, కంటెంట్‌లో స్పష్టంగా ఉపయోగించడం చాలా ముఖ్యం.

Ø  మల్టీమీడియా: ఇమేజ్, వీడియో, ఆడియో కంటెంట్ Bingలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతుంది.

Ø  సోషల్ సిగ్నల్స్: Facebook, Twitter వంటి సోషల్ మీడియా షేర్లు Bing ర్యాంకింగ్‌లో ప్రభావం చూపుతాయి.

Ø  యూజర్ అనుభవం: పేజీ డిజైన్, నావిగేషన్, లోడ్ వేగం Bingలో కూడా ముఖ్యమైనవి.

Ø  లోకల్ SEO: Bing Maps, స్థానిక వ్యాపార లిస్టింగ్స్ Bingలో బలంగా పనిచేస్తాయి.

 


 

III. బ్రౌజర్ (Browser) మరియు సెర్చ్ ఇంజిన్ (Search Engine)

 

బ్రౌజర్ ఏంటీ, సెర్చ్ ఇంజన్ ఎంటీ అనుకొంటున్నారా. నిజమే రెండూ ఒకటి కావు. ఈ రెండు వేర్వేరు పనులను, కలసి పనిచేస్తాయి. ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం.

 

a. బ్రౌజర్ అంటే ఏమిటి?

       బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్ వేర్ (ఉదా: Chrome, Edge, Firefox, Safari).

       వీటి పని వెబ్‌సైట్లను చూపించడం మాత్రమే.

       యూజర్  టైప్ చేస్తే, బ్రౌజర్ ఆ వెబ్‌సైట్‌ను  స్క్రీన్ పై  చూపిస్తుంది.

       ఇది ఇంటర్నెట్‌ లో ఏదైనా సమాచారాన్ని చూడటానికి ఉపయోగించే ఒక టూల్ మాత్రమే.

 

b. సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి?

       సెర్చ్ ఇంజిన్ అనేది ఒక వెబ్‌సైట్ లేదా సర్వీస్ (ఉదా: Google, Bing, DuckDuckGo).

       ఇది యూజర్ కోరిన సమాచారాన్ని వెతికి అందించడం.

 

c. రెండూ, ఎలా కలసి పనిచేస్తాయి?

         మీరు బ్రౌజర్ ద్వారా సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తారు.

         ఉదాహరణ: Chrome (బ్రౌజర్) ఓపెన్ చేసి Google.com (సెర్చ్ ఇంజిన్) లో వెతుకుతారు.

         బ్రౌజర్ లేకపోతే సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లలేరు; సెర్చ్ ఇంజిన్ లేకపోతే వెబ్‌సైట్లను కనుగొనడం కష్టం.


No comments:

Post a Comment